Site icon NTV Telugu

VIJAYASHANTHI : రెగ్యులరైజ్ అవుతారో లేదో ఆ దేవుడికే ఎరుక

Vijayashanti

Vijayashanti

బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె ‘నిరాశతో బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఈ సర్కారు ఏ మాత్రం పట్టింపులేని తీరును ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని కూడా సర్కారు అటకెక్కించింది. దీనిపై సీఎం కేసీఆర్ గారు హామీ ఇచ్చి ఏడాది గడిచినా కదలిక లేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది పాతిక, ముప్ఫైయ్యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని రెగ్యులరైజేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నరు. వీరు రిటైర్ అయ్యేలోగానైనా రెగ్యులరైజ్ అవుతారో లేదో ఆ దేవుడికే ఎరుక.

Also Read : Bangladesh fire: బట్టల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది దుకాణాలు దగ్ధం

వీలైనంత మందిని రిటైర్ చేయించి… తక్కువలో తక్కువ మందికి మాత్రమే ఆర్ధిక ప్రయోజనాలు కల్పించి డబ్బులు మిగుల్చుకోవాలనే కుట్ర కోణం కూడా ఇందులో కనిపిస్తోంది.’ అంటూ ట్విట్టస్త్రాలు సంధించారు. అంతేకాకుండా.. టెన్త్‌ పేపర్‌ లీకేజీపై స్పందిస్తూ.. తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని ఆమె విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయిందని బీజేపీ నేత మండిపడ్డారు. నిరాశతో బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఈ సర్కారు ఏ మాత్రం పట్టింపులేని తీరును ప్రదర్శిస్తోందని విమర్శించారు విజయశాంతి.

Also Read : Dharmana Prasada Rao: తొడగొట్టి.. మీసం మెలేసి.. మంత్రి ధర్మాన రూటే సపరేటు

Exit mobile version