TVK vs DMK: స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK vs DMK: తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) మద్దతు ఇవ్వాలని డీఎంకే (DMK) నిర్ణయించుకోవడంపై నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Vijay) పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను (MK Stalin) ఏకంగా ‘సావర్కర్ 2.0’ (Savarkar 2.0) అని అభివర్ణిస్తూ టీవీకే ఐటీ వింగ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ (RSS) యూనిఫామ్‌లో స్టాలిన్ ఉన్నట్లు రూపొందించిన ఒక ఫోటోను ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేస్తూ ఈ సెటైర్లు వేసింది.
కేవలం ‘సావర్కర్ 2.0’ అనడమే కాకుండా, “సనాతనం అల్లా… సన్-ధనం” అంటూ మరో పోస్ట్‌తో డీఎంకేపై టీవీకే వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే యూ-టర్న్ తీసుకున్నారని టీవీకే ఆరోపిస్తోంది. పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించాలని టీవీకే గతంలోనే డీఎంకేకు సవాల్ విసిరింది. ఒకవేళ ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, వాకౌట్ చేసినా అది బీజేపీకి (BJP) లొంగిపోవడమే అవుతుందని విమర్శించింది. అయితే, తన నిర్ణయాన్ని స్టాలిన్ గట్టిగా సమర్థించుకున్నారు. ఏప్రిల్‌లో తాము ఈ బిల్లును వ్యతిరేకించినప్పుడు లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం ఇప్పుడు లిఖితపూర్వకంగా అంగీకరించిందని స్టాలిన్ స్పష్టం చేశారు. 2024 నుంచి డీఎంకే చేస్తున్న నిరంతర పోరాటానికి, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయంగా దీనిని అభివర్ణించారు. ప్రజలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఆలోచించాలని, ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది, రాష్ట్రానికి ప్రయోజనకరమైనది కావడం వల్లే మద్దతు ఇస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.
Also Read
- PM Modi on Women's Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
- Mallikarjun Kharge: 'ఇది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం'.. డీలిమిటేషన్ బిల్లుపై మల్లికార్జున ఖర్గే ఫైర్..
- Bisleri in Trouble Again: మళ్లీ చిక్కుల్లో బిస్లెరీ.. నీటి నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా.. FSSAI కీలక చర్య
- DMK Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. కేంద్రం హామీతో స్టాలిన్ తీర్మానం..
ஸ்டாலின் என்கிற சாவர்க்கர் 2.0 https://t.co/vzlZOY9I5B
— TVK IT Wing Official (@TVKHQITWingOffl) November 28, 2026
తాజావార్తలు
-
TVK vs DMK: స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
-
PM Modi on Women’s Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
-
AP Panchayat Elections 2026: రేపే రెండో విడత పల్లె పోరు.. బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు.. నిఘా నీడలో పోలింగ్..!
-
Mallikarjun Kharge: ‘ఇది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం’.. డీలిమిటేషన్ బిల్లుపై మల్లికార్జున ఖర్గే ఫైర్..
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
ట్రెండింగ్
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!