NTV Telugu Site icon

Vijay Rashmika : ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ అయిన విజయ్, రష్మిక.. ఎక్కడికి పోతున్నారేంటి ?

Vijay Rashmika Engagement

Vijay Rashmika Engagement

Vijay Rashmika : టాలీవుడ్ రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రిలేషన్ షిప్ లో ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. తమ ప్రేమ వ్యవహారంపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ.. వారిని చూసిన వారంతా ఫిక్సయిపోయారు. రీసెంట్ గా రష్మిక.. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీతో రిలేషన్ లో ఉన్నట్లు పరోక్షంగా హింట్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. రష్మికతో లవ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తానే చెబుతానంటూ తెలిపారు. సెలబ్రిటీ కనుక.. తన పర్సనల్ లైఫ్ పై అందరికీ ఆసక్తి ఉంటుందన్నారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు.

Read Also:Naini Rajender Reddy: వారికి జాతకాల పిచ్చి ఉంది.. హరీష్ రావుకు నాయిని రాజేందర్ కౌంటర్

దీంతో వారిద్దరూ చేసిన కామెంట్స్ ఫుల్ గా ట్రెండ్ అవుతుండగా రీసెంట్ గా ఫేమస్ రీల్ పోస్ట్ చేశారు విజయ్. అందులో 2025లో పెళ్లి చేసుకుంటావా అంటే నో అని చెబుతున్న వీడియోను షేర్ చేశారు. అలా వచ్చే ఏడాది కూడా తాను పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో రష్మిక, విజయ్ వివాహం ఎప్పుడు చేసుకుంటోరనని అంతా తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తాజాగా విజయ్, రష్మిక.. ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంటికి చిక్కారు. ముంబై విమానాశ్రయంలో సోమవారం రాత్రి మెరిశారు. ముందుగా రష్మిక.. ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆ సమయంలో కెమెరాకు పోజులిచ్చారు. అక్కడే ఉన్న అభిమానులు ఆమెతో పిక్స్ దిగారు. ఆ తర్వాత విజయ్ రాగా.. ఆయన కూడా అభిమానులతో ఫోటోలను తీసుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also:CPI Ramakrishna: రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు.. అమిత్ షాని ప్రధాని వెనకేసుకొస్తున్నారు!

అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్, రష్మిక వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నట్లు ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ తమ షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని.. విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. న్యూ ఇయర్ తర్వాత తిరిగి ఇండియా రానున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్.. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న VD 12 మూవీ సంవత్సరం విడుదల కానుంది. మరోవైపు, రష్మిక తాజాగా పుష్ప-2తో సందడి చేయగా.. చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఇద్దరూ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Show comments