Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
- సీఎం విజయ్ సర్కార్‌పై అన్నామలై, స్టాలిన్ విమర్శలు..
- జీఎస్టీ వసూళ్ల క్షీణత, ఏపీకి పెట్టుబడులు తరలివెళ్లడంపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుండటంపై సీఎం విజయ్ సర్కార్‌పై డీఎంకే, అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెట్టుబడుల్ని ఆకర్షించే సామర్థ్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మందగించాయని అన్నామలై అన్నారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1614 కోట్ల దక్షిణ కొరియా పెట్టుబుడులు ఏపీకి తరలిపోయాయని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.
మాజీ బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఎక్స్‌లో విజయ్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో స్వల్ప వృద్ధి తర్వాత మే నుంచి సెప్టెంబర్ వరకు తమిళనాడు జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే తగ్గినట్లు గణాంకాలతో సహా వివరించారు. సెప్టెంబర్‌లో 5 శాతం క్షీణతతో రూ. 10,188 కోట్లకు చేరాయని, అక్టోబర్ లో మాత్రం 3 శాతం వృద్ధితో రూ.11,661 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది.
Also Read
- Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
- Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కూడా విజయ్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. తమిళనాడు జీఎస్టీ వృద్ధి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1614 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లాయని విమర్శించారు.
హ్యుందాయ్, కియా సంస్థలకు ఆటోమొబైల్ విడిభాగాలను సరఫరా చేసే మూడు దక్షిణ కొరియా కంపెనీలు హ్వాషిన్, సియోన్, ఐవామెట్ ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అనంతపురంతో ఈ సంస్థలు రూ. 1614 కోట్ల పెట్టుబడుల ద్వారా 1418 ఉద్యోగాలు కల్పించనున్నట్లు అంచనా వేశారు
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!