Vijay Devarakonda VD 12 Update: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ చేయగా మరింత భాగాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం శ్రీలంక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది.
Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఓ సాలిడ్ అప్డేట్ ను పోస్టర్ రూపంలో విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ ముఖంపై రక్తం కారుతున్నట్లుగా కనబడుతున్నారు. కారుతున్న నెత్తురుతో చాలా కోపంగా ఆకాశంలో చూస్తూ అరుస్తున్నట్లుగా ఉండే పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, అలాగే ఫస్ట్ లుక్కును ఈ నెలలో ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్ని సరిగా కుదిరితే.. ఈ సినిమా మార్చి 28, 2025న విడుదల చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mr Bachchan Promotions: “మెట్రో” వేగంతో దూసుకపోతున్న ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్..