NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న సినిమా డ్రాగన్. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నిత్యం లీకుల రూపంలో చాలా రూమర్స్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. తాజా రూమర్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది. ఇంతకీ ఆ క్రేజీ లీక్ ఏంటో తెలుసా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్‌ను డిజైన్ చేస్తున్నట్లు, ఆ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌ను సంప్రదిస్తారని జోరుగా టాక్ నడుస్తుంది. అయితే ఈ వైరల్ న్యూస్‌లో నిజం ఎంతవరకు ఉందో వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఈ రూమర్‌పై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
READ ALSO: Kohli vs Gambhir: కోహ్లీ- గంభీర్ మధ్య మళ్లీ గొడవ.. ఈసారి ఏకంగా స్టేడియంలోనే..?
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో యాక్షన్ ఫీక్స్‌లో ఉంటుందని టాక్. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ సినిమాని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడని సినీవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకూ ఈ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా ఈ సినిమా బెస్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తుంది.
READ ALSO: Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా!