Vijay Devarakonda : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి) 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఒక చారిత్రక ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read : Tvk Vijay : విజయ్ కు షాక్.. ఎన్నికల తర్వాతే విజయ్ ‘జననాయగన్’..
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి స్వయంగా పెళ్లి పత్రికను అందజేశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ కొద్దిసేపు ముచ్చటించారు. తన జీవితంలో కీలకమైన ఈ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, కాబోయే దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో వెండితెరపై మెరిసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఉదయ్‌పూర్ వివాహం అనంతరం హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?