స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’.. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీనితో చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ చెన్నై వెళ్లారు. ఇందులో భాగంగా ఒక ప్రెస్ మీట్ పాల్గొన్న ఆయన చిరంజీవి గురించి కూడా చెప్పుకొచ్చారు. విజయ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అయనంటే ఎంతో గౌరవం.ఆయన ఒక లెజెండ్..ఆయన సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘వాల్తేరు వీరయ్య’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ను ఇచ్చారు. ఆయన ఒక ఎవరెస్టు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆయన సాధించిన విజయాలు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తులను విజయాలు , పరాజయాలతో మనం జడ్జ్ చేయలేము.
కానీ రీసెంట్ గా ఆయన నటించిన భోళా శంకర్ ప్లాప్ కావడంతో కొంతమంది ఆయనపై చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే నాకు బాధేస్తుంది. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడం అస్సలు కరక్ట్ కాదు. చిరంజీవి, రజినీకాంత్ వంటి వారికీ ఇలాంటి అపజయాలు వరసగా ఆరేడు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ విశ్వరూపం చూపిస్తారని విజయ్ చెప్పాడు. వాళ్ళకి విజయాలు అపజయాలు కొత్తేమి కాదు.. రజినీకాంత్ గారికి వరసగా ఆరు ప్లాప్ లు వచ్చాయి. రీసెంట్ గా అయన నటించిన ‘జైలర్’ అనే సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.500 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది., అందుకని వారు జయాపజయాల గురించి పట్టించుకోరని విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.