రిషికేశ్‌లో యుద్ధ వాతారణం నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాఫ్టింగ్ గైడ్‌లు-పర్యాటకులు ఒకరికొకరు తెడ్డులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెడ్డులను ఆయుధాలుగా ఉపయోగించి దాడులకు తెగబడ్డారు. అసలేం జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
రిషికేశ్‌కి ఆధ్యాత్మిక అనుభూతి కోసం సందర్శకులు వస్తుంటారు. ఇక జూన్‌లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. కళాశాలలు, విద్యాసంస్థలు మరియు న్యాయ కార్యాలయాలు మూసివేయడంతో అనేకమంది దేశవ్యాప్తంగా ఈ ప్రదేశానికి వస్తుంటారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. రిషికేశ్‌లో పర్యాటకులు-రాఫ్టింగ్ గైడ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. తెప్పల కోసం వచ్చిన పర్యాటకులకు బోట్‌మెన్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో అనేక మంది పర్యాటకులు గాయపడ్డారు. గంగానది ఒడ్డున జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో రిషికేశ్‌లో వైరల్‌గా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మరియు రివర్ రాఫ్టింగ్ ఔటింగ్ సమయంలో తెడ్డులను ఆయుధాలుగా ఉపయోగించడం కనిపిస్తుంది.
నది ఒడ్డున కొంత మంది పర్యాటకులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గైడ్స్ ఇక్కడ మద్యం సేవించకూడదని సూచించారు. దీంతో పర్యాటకులు వారిపై ఎదురు తిరగడంతో ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.
Kalesh b/w Tourists who had come for rafting and boatmen clashed. As a result, many people got injured. This video of the fight that took place on the banks of the Ganges has gone viral, Rishikesh UK
pic.twitter.com/jJNxXNMaxd— Ghar Ke Kalesh (@gharkekalesh) June 8, 2024