NTV Telugu Site icon

Viral Video: డ్రైవర్ లేకుండా ఉన్నట్లుండి స్టార్ట్ అయిన బస్సు.. పెట్రోల్ పంపు కార్మికుడు మృతి

New Project (77)

New Project (77)

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఘంటా ఘర్ రోడ్‌లోని పెట్రోల్ పంపు వద్ద ఆపిన బస్సు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండా కదిలింది. పెట్రోల్ పంపు వద్ద బైక్ టైర్‌కి గాలిని నింపుతున్న ఉద్యోగిపై నుంచి బస్సు దూసుకెళ్లింది. రోడ్డు దాటుతూ ఆగి ఉన్న మరో బస్సును ఢీకొట్టింది. ఊహించని ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఉద్యోగిని పరిస్థితి విషమించడంతో లక్నోకు తరలించారు.

Read Also:Aadi Srinivas: స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..

ఘంటా ఘర్ రోడ్డులోని టాండన్ పెట్రోల్ పంప్ వద్ద బుధవారం (జూలై 3) రాత్రి డీజిల్ నింపేందుకు ఓ బస్సు డ్రైవర్ వచ్చాడు. ఇంధనం నింపుతున్న సమయంలో బస్సు చెడిపోయింది. డ్రైవర్ బస్సును పెట్రోల్ పంపు ఆవరణలో నిలిపి చక్రాల ముందు ఇటుకలను ఉంచి వెళ్లిపోయాడు. గురువారం (జూలై 4) ఉదయం 9 గంటల ప్రాంతంలో బస్సు అకస్మాత్తుగా దానంతట అదే కదలడం ప్రారంభించింది. మధోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డకోలికి చెందిన ఉద్యోగి తేజ్‌పాల్ (36) టైర్లలో గాలిని నింపుతున్నాడు. అదే సమయంలో అక్కడే ఆగి ఉన్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన పెట్రోల్ వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Tummala Nageswara Rao: రైతులను ఆదుకోండి.. తుమ్మలకు వినతిపత్రం

పెట్రోలు పంపు ఉద్యోగులు తేజ్‌పాల్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం లక్నోకు రెఫర్ చేశారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. సిటీ ఇన్‌స్పెక్టర్ సంజయ్ పాండే మాట్లాడుతూ.. బస్సు పనిచేయని స్థితిలో పార్క్ చేసినట్లు తెలిపారు. చక్రాల ముందు ఉంచిన ఇటుకలను తొలగించడం, ప్రాంతం వాలు కారణంగా ప్రమాదం సంభవించిందని తెలిపారు. తేజ్‌పాల్ బస్సు ముందు చక్రం కింద నలిగిపోయి తీవ్ర అస్వస్థతతో హర్దోయ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.