Site icon NTV Telugu

Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్

Dk

Dk

ఎన్నికల ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 26న 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హావేరీకి చేరుకున్నారు. పార్టీ అభ్యర్థి వినోదా అసూటి తరపున ప్రచారానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి.. నినాదాలు చేస్తున్నారు. ఆయన కారు దిగి నడుస్తుండగా కాంగ్రెస్ నేత, మునిసిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్.. ఏకంగా డీకే.శివకుమార్ భుజంపై చెయ్యి వేశాడు. దీంతో అసహనానికి గురైన డిప్యూటీ సీఎం.. చెంపచెళ్లుమనిపించారు. అంతేకాకుండా పక్కకు నెట్టేశారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే వెనక్కి నెట్టేశారు. ఈ పరిణామంతో ఆ నాయకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Congress: “అయోధ్య శ్రీరాముడికి మద్దతు ఇచ్చినందుకు వేధింపులు”.. కాంగ్రెస్‌కి రాధికా ఖేరా గుడ్ బై..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ ముగియగా.. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. విదేశాల్లో ఉన్న ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  డీకే.శివకుమార్ కుట్ర చేసి ఇరికించారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: CSK vs PBKS: రాణించిన జడేజా.. సీఎస్కే ఎంత స్కోరు చేసిందంటే..?

Exit mobile version