Ranji Trophy 2024: మధ్యప్రదేశ్‌పై ఉత్కంఠ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidarbha set final with Mumbai in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించిన విదర్భ.. మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 10న ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.
శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి సెంచరీ (126) బాదాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ సెంచరీ (141) చేయగా.. అక్షయ్ వాడ్కర్ అర్ధ శతకం (77) బాదాడు. దాంతో మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యంను విదర్భ విధించింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. చివరి రోజు మధ్యప్రదేశ్ విజయానికి 93 పరుగులు అవసరం కాగా.. విదర్భ గెలుపుకు నాలుగు వికెట్లు అవ్సరం అయ్యాయి. ఓవర్‌నైట్ స్కోరు 228/6 తో బుధవారం ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ (4), అనుభవ్ అగర్వాల్(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖాన్‌తో కలిసి సారాంశ్ జైన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సారాంశ్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఖెజ్రోలియా (11) కూడా బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..