Victory Venkatesh: ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ రోల్ లో నటంచిన విక్టరీ వెంకటేష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా మెగా విక్టరీ అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో పనిచేయడం తనకు ఎంతో అద్భుతమైన అనుభవమని.. చిరుతో కలిసి పనిచేయడం నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చందని ఆయన అన్నారు.
Nidhhi Agerwal: “ఇది మా రెండో ఇల్లు”.. ‘ది రాజా సాబ్’ నా కెరీర్‌లో స్పెషల్ మూవీ..!
ఇది నిజంగా భిన్నమైన సినిమా. ఈ చిత్రంలో కథ నాకు ఎంతో నచ్చిందంటూ అంటూ వెంకటేష్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సినిమా తనకు ప్రత్యేకంగా అనిపించడానికి ఇదే కారణమని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితో తన కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముందుగా నా దర్శకుడు అనిల్ రావిపూడికి, అలాగే ఆయన రచనా బృందానికి నా ధన్యవాదాలు అంటూ.. ఆయన దగ్గర అద్భుతమైన టీమ్ ఉంది. ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు అని అన్నారు.
Director Maruthi: ఇక నేను మాట్లాడను.. నా పని మాట్లాడుతుంది..!
అలాగే ఈ చిత్రాన్ని సాధ్యమయ్యేలా చేసిన నిర్మాతలు సుష్మిత, సాహు తదితరులకు కూడా వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే హీరోయిన్ నయనతార గురించి మాట్లాడుతూ.. ఇదివరకే తాము కలిసి చేశామని.. కానీ ఆమె ఈ సినిమాలో చాలా అందంగా కనిపించిందని, తన పాత్రను అద్భుతంగా పోషించిందన్నారు. మొత్తానికి ఇది ఒక సంపూర్ణ కుటుంబ వినోద చిత్రం అని, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరిస్తారని తనకు నమ్మకం ఉందని వెంకటేష్ అన్నారు. ఈ సినిమాతో పాటు.. మంచి ఉద్దేశంతో తీసిన అన్ని సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చివరగా ఈ చిత్ర బృందం మొత్తం సూపర్ సక్సెస్‌కు అర్హులని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు.