Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్” ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. ఇకపోతే, విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 14, 2025న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి అన్‌స్టాపబుల్ షోకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేడు (ఆదివారం) జరిగింది. వెంకటేశ్, అనిల్ ఇప్పటికే స్టూడియోలో చేరగా ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాలకృష్ణ, వెంకటేశ్ కలిసి సరదాగా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Victory @VenkyMama and Director @AnilRavipudi grace the #UnstoppableWithNBK show on @ahavideoin 💥💥💥#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.#Venkatesh #AnilRavipudi #UnstoppableSeason4 #NandamuriBalakrishna pic.twitter.com/4P7BHcqKeF
— Sai Satish (@PROSaiSatish) December 22, 2024
Also Read: Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
బాలయ్య, వెంకీమామతో కలిసి సరదా సంఘటనలతో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తడానికి రెడీ అయ్యారు. ఈ ఎపిసోడ్‌లో వారు చర్చించిన విషయాలు, బాలయ్య ఏమేమి ప్రశ్నలు అడిగారన్న వివరాలు తెలుసుకోవాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు.