Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రికార్డులు సృష్టిస్తోంది.
Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతులు వీరే..!
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, కెమిస్ట్రీ, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. ఈ సందర్బంగా.. చిరంజీవి మాట్లాడుతూ “నాతో నిజమైన కెమిస్ట్రీ ఉన్న యాక్టర్ ఎవరంటే అది ఓన్లీ వెంకటేష్. మేమిద్దరం కాలేజ్ రోజుల నుంచే స్నేహితులం. ఇన్నేళ్ల తర్వాత కలిసి సినిమా చేయడం నిజంగా అద్భుతం. స్క్రీన్ మీద మా ఎనర్జీ, మా స్నేహం ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఎక్కడా ‘నేను స్టార్, ఆయన స్టార్’ అన్న భావన రాలేదు. అవసరమైన చోట నేను తగ్గాను, అవసరమైన చోట ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. అనిల్ రావిపూడి మొదటి సీన్ నుంచే చాలా క్లెవర్‌గా రాశాడు” అని అన్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రేక్షకులను నవ్వించాయి. సినిమా విడుదల తర్వాత అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు ఆయన్ను ‘వెంకి గౌడ’ అంటూ పిలవడం గురించి మాట్లాడుతూ.. “అందరూ నన్ను వెంకి గౌడ అని పిలుస్తున్నారు. కానీ ఒకసారి ఎవరో మా ఆవిడను ‘నీరజ గౌడ’ అని పిలిచారట. పాపం ఆమెకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించిందని, బాగా ఫీలయ్యింది” అంటూ నవ్వుతూ చెప్పారు.
BMC Result: నేడు ముంబై మున్సిపల్ ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే!
అంతేకాదు చిరంజీవి–వెంకటేష్ లుక్స్, వారి ఎనర్జీ గురించి గూగుల్‌లో తప్పు వయసులు చూపిస్తున్నాయంటూ వస్తున్న మీమ్స్పైనా ఇద్దరూ సరదాగా స్పందించారు. ఇంత ఎనర్జీతో ఇంకా ఇలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అంటూ అభిమానుల ప్రశంసలను చిరంజీవి గుర్తుచేశారు.