బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.విక్కీ కౌశల్ ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’, మసాన్ , సర్దార్ ఉద్దమ్ వంటి చిత్రాల లో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇక విక్కీ కౌశల్ నటించిన ఉరి సినిమా తెలుగు లో కూడా డబ్ అయి ఇక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గత ఏడాది విక్కీ కౌశల్ ప్రాధాన పాత్ర లో నటించిన ‘సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీ లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’.మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 22 వ తేదీ న ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ధూమ్ త్రీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాల ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ లో యశ్పాల్ శర్మ, వేదాంత సిన్హా, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, సదియా సిద్ధిఖీ, అల్కా అమీన్, సృష్టి దీక్షిత్ మరియు భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 50 వ చిత్రం గా తెరకెక్కింది..