NTV Telugu Site icon

V. Hanumantha Rao : మోడీ రైతులకు ఎన్నో చేశానని గొప్పలు చెప్తున్నారు

Vh

Vh

ఫిబ్రవరి 14వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జన్మదినమని, దామోదర్ సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా సంజీవయ్య జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న దామోదర సంజీవయ్య జన్మదిన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు వీహెచ్‌. 13వ తేదీన రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారని, ఆందోళన రెండు రోజుల ముందే ఢిల్లీలోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు విహెచ్‌. అంతేకాకుండా.. మోడీ రైతులకు ఎన్నో చేశానని గొప్పలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారని, వారిని ముందే అడ్డుకోవాలని బార్డర్లలో పోలీసులు భారీ క్రేడ్లు ఏర్పాటు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?

రైతులను ఎవరిని కూడా ఢిల్లీలోకి రానివ్వడం లేదని, రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. అన్నదాతల నోట్లో మోడీ మట్టి కొడుతున్నాడని వీహెచ్‌ విమర్శలు గుప్పించారు. రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునే అంశాలు నేను ఖండిస్తున్నానని, రైతులకు మాట్లాడే హక్కు లేకుండా మోడీ చేస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా రైతులు ఓట్లు వేస్తారని, సెక్యులర్ గా ప్రజల సమస్యలు తెలుసుకుని పార్టీలకు ఓటు వేయాలన్నారు. రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన తిరిగి న్యాయాత్ర చేస్తున్నారు అలాంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.

BRS Balka Suman: సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు