Ghantasala Centenary Award: భారతదేశ చరిత్రలో అందరూ గర్వించ దగ్గ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి అన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం. ఆకృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని ఆయన సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత సి. కృష్ణవేణికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ లాంటి మహానటుడికి మనదేశం చిత్రంలో తొలి అవకాశం ఇవ్వడం మరచి పోలేని విషయం. ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయనను తొలిసారి సంగీత దర్శకుడిని చేసిన కృష్ణ వేణికి ఇవ్వడం ఔచిత్యం గా ఉంది. ఎవరినైనా సక్సెస్ తర్వాతనే గుర్తు పెట్టు కుంటారు. కానీ ఎంతోమంది కి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణి కి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం. ఈ వేదిక ద్వారా ఈ మహనీయురాలితో పరిచయం కావడం నా అదృష్టం’ అని చెప్పారు.
Sai Dharam Tej New Movie: సాయిధరమ్ కొత్త చిత్రం పూజతో ఆరంభం
విశిష్ట అతిథి గా విచ్చేసిన తెలంగాణా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మాట్లాడుతూ ‘ఘంటసాల శత జయంతి పురస్కారాన్ని కృష్ణవేణిగారికి ఇవ్వడం ఆమెకు ఆకృతి ఇచ్చిన అరుదైన గౌరవం. ఇప్పటి తరం సినిమా వాళ్ళకు ఆమె జీవితం ఒక పుస్తకంలా ఉపయోగ పడుతుంది’ అని అన్నారు. ప్రముఖ నటి రోజారమణి కృష్ణవేణి ఒక లెజెండ్ అని ప్రశంసించారు. ఘంటసాల కోడలు ఈ వేడుకలో పాల్గొనడం అదృష్టమన్నారు. పూర్వ ప్రధాని పి.వి. మనుమరాలు అజిత కృష్ణవేణిగారిని చూడాలన్న కల ఇప్పటికి నెరవేరిందన్నారు. ఈ కార్య క్రమానికి ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఇందులో ఫిక్కీ సిఎండి అచ్యుత జగదీష్ చంద్ర , నటుడు మోహనకృష్ణ పాల్గొన్నారు.