Site icon NTV Telugu

Yellamma : ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు సీనియర్ హీరో?

Yellama, Devisri Prasad

Yellama, Devisri Prasad

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు యెల్డండి, తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma) తో మరోసారి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే వెరైటీ లుక్‌లో పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్‌ల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అది కూడా రాజశేఖర్ ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

Also Read : Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ ప్రేమలో ఉందా? నెట్టింట వైరల్ అవుతున్న ప్రైవెట్ ఫోటో

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే, స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టి-సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. రాజశేఖర్ వంటి సీనియర్ హీరో తోడవ్వడంతో ఈ సినిమాకు మరింత వెయిట్ పెరిగినట్లయ్యింది. త్వరలోనే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

Exit mobile version