Site icon NTV Telugu

Yellamma : ‘ఎల్లమ్మ’లో డీఎస్పీ పాత్ర పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

Yellama Dsp

Yellama Dsp

మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP), ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో డీఎస్పీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేశారు. మునుపెన్నడూ చూడని విధంగా పొడవాటి జుట్టు, గడ్డం, మాస్ లుక్‌లో దేవిశ్రీ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : Spirit : ‘స్పిరిట్’లో విలన్‌గా ఆయనేనా..?

ఈ సినిమా కథ ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘రేణుక ఎల్లమ్మ’ గ్రామ దేవత చుట్టూ, జానపద కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగనుంది. వేణు యెల్దండి సుమారు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేశారు. గతంలో నాని, నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినా, చివరికి దేవిశ్రీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో దేవిశ్రీ ప్రసాద్ క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా, చాలా షాకింగ్‌గా ఉంటుందట. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జానపద కళలను, సామాజిక అంశాలను గుండెకు హత్తుకునేలా చూపిస్తూ ‘బలగం’ మ్యాజిక్‌ను వేణు మళ్ళీ రిపీట్ చేస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version