మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం2 అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న విడుదలకు రెడీ అవుతుండగా, హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3 పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3 వాయిదా పడుతుందా? లేక పూర్తిగా ఆగిపోతుందా? అనే చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా వెంకటేష్ మాత్రం వరుస కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా షూటింగ్ డిసెంబర్ 2025లో మొదలైంది. ఇది ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. 2026 దసరాకి థియేటర్స్ లోకి రాతోంబోది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ తో మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన సంక్రాంతి సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ 10వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ను తెరకెక్కించనున్నాడు. సో ఈ లెక్కన వెంకీ చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగు దృశ్యం 3 చేసే ఉద్దేశంలో లేడని సమాచారం. మరి దృశ్యం 3ని అలా వదిలేస్తాడో లేక మధ్యలో ఎప్పుడైనా డేట్స్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే దృశ్యం 3 లేనట్టే.