టాలీవుడ్ సినీ తారల్లో క్రికెట్ ని ఎంతగానో ఇష్టపడే వారిలో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వెంకీ మామ క్రికెట్ లవర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే చాలు షూటింగ్ ను కూడా వదిలిపెట్టి స్టేడియం లోకి వాలిపోతుంటాడు. ఇక హైదరాబాదులో మ్యాచ్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో విక్టరీ వెంకటేష్ సందడి చేశాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ క్రికెటర్స్ లో ఒకరైన వెస్టిండీస్ లెజెండరీ మాజీ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో కలిసి సెల్ఫీ దిగాడు. “ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో దిగ్గజ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. వెంకీ మామ సెల్ఫీ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.ఈ సెల్ఫీ పిక్ చూసిన నెటిజన్స్. ‘‘ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యాన్స్ అయితే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవ్వడం విశేషం. ఈ సెమీ ఫైనల్ వీక్షించేందుకు కొందరు సెలెబ్రెటీలకు గోల్డెన్ పాస్ లు కూడా జారీ చేశారు. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారిలో రజినీకాంత్ కూడా ఒకరు.అలాగే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించేందుకు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం తదితరులు సందడి చేశారు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే .ఆయన నటిస్తున్న ‘సైంధవ్’మూవీ విడుదలకు సిద్ధంగా వుంది.చేయాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే రుహాని శర్మ, ఆండ్రియ జెర్మియా, కోలీవుడ్ హీరో ఆర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు