Site icon NTV Telugu

Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో

Venkatesh Anilravipudi

Venkatesh Anilravipudi

‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కీలక పాత్రలో కనిపించనున్నా విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ దాదాపు అరగంట పాటు స్క్రీన్‌పై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ నెక్ట్స్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!

అంటే ఈ ఏడాదిలోనే వెంకటేష్ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘ఆదర్శ కుటుంబం’ అనే రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు తర్వాత కూడా వెంకీ తదుపరి సినిమాల‌పై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్. కెరీర్ ప్రారంభించి దాదాపు నలభై సంవత్సరాలు గడిచినా, యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తూ దూసుకుపోతున్న వెంకటేష్ మరోసారి తన స్టామినా‌ను ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన విక్టరీ @వెంకీమామ గారు” అంటూ పోస్ట్ చేశారు. అలాగే వెంకటేష్ నటిస్తున్న తాజా పాత్ర ‘మన శంకర వర ప్రసాద్’‌ను తమ కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా, “ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో కలిసి మీరు స్క్రీన్లను వెలిగించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ఈ ఆత్మీయ బర్త్‌డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అనిల్ రావిపూడి – వెంకటేష్‌ల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి చూపిస్తున్నాయి.

 

Exit mobile version