Site icon NTV Telugu

Venkaiah Naidu: విద్య, వైద్యం తప్ప.. ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వద్దు..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వకూడదు.. విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకోండి.. కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది.. ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెట్టుకోవాలన్నారు.

Read Also: Merugu Nagarjuna: ఎల్లుండి అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ.. ఆయన ఆలోచనలు భారతావనికి దిక్సూచి

ఇక, ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదు.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు.. విద్య, వైద్యం తప్ప అన్నారు వెంకయ్యనాయుడు.. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి అని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటారు.. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు అన్నారు.. ఇంట్లో వంట రూమ్‌, పూజా రూమ్‌ తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.. అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.

Exit mobile version