NTV Telugu Site icon

Vemulawada : వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారం

Vemulawada

Vemulawada

Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Sudden Death: భర్త రిటైర్మెంట్ పార్టీలో భార్య సడన్ డెత్.. వీడియో వైరల్

అయితే ఆలయ ప్రాంగణంలో అనే మతానికి చెందిన మాంసాహారం ప్యాకెట్ లను పంపిణీ చేసిన ఆలయ యంత్రాంగం గమనించకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజన్న ఆలయంలో రోజుకో వివాదంతో మసకబారుతోంది ఈ సంఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జరిగిన సంఘటనపై ఆలయ ఈవోతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Goa: టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!

Show comments