Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హామీల అమలుకు కౌంట్ డౌన్ షురూ అయ్యిందని ఆరోపించారు. హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు.. వెంటాడుతాం.. పోరాడుతామని అన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
Read Also: Praja Bhavan: తొలగిపోయిన ప్రజాభవన్ కంచె.. చూసేందుకు ఎగబడ్డ జనాలు
అబద్దపు ప్రచారాలతో ప్రజలను అయోమయానికి గురి చేశారని.. రెండు శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ గద్దెనెక్కిందని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణాలొడ్డి తెచ్చుకున్న తెలంగాణను.. కేసీఆర్ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపారని తెలిపారు. అదే ఉద్యమపంథాను కొనసాగిద్దాం.. ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేద్దామని అన్నారు. అధర్మం, మోసంతో గెలిచిన పార్టీ ఎక్కువ రోజులు ఉండదు.. ధర్మమే గెలుస్తుంది.. మనమే నిలబడతామని కార్యకర్తలకు తెలిపారు.
Read Also: Nizamabad PFI Case: PFI కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు