2024 Dussehra Offer: రూ.100 కొట్టు మేకను పట్టు.. దసరాకు బంపర్ ఆఫర్! ఎక్కడో తెలుసా
- దసరా పండుగకు బంపర్ ఆఫర్
- మొదటి బహుమతిగా 10 కిలోల మేక
- మూడో బహుమతిగా కాటన్ బీర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 Dussehra Scheme in Velmakanne Village: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ప్రతి దసరాకు ఇది సర్వసాధారణమే. అయితే ఓ గ్రామంలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీమ్‌ను పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. స్కీమ్‌లో ఐదు బహుమతులను కూడా అందించనున్నారు. ఆ బహుమతులే ఇక్కడ వీరిని వార్తల్లో నిలిచేలా చేశాయి.
నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామంలోని మరికొందరు యువకులు దసరా పండగ కోసం ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. గ్రామస్తుల కోసం ఒక్కో కూపన్ ధర రూ.100గా నిర్ణయించారు. త్వరలోనే కూపన్‌లను గ్రామస్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ 12న దసరా పండగా కాగా.. అక్టోబర్ 10న సాయంత్రం 6 గంటలకు డ్రా తీస్తారు. బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్న పిల్లతో డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని ఓ బ్యానర్ కట్టారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసిన గోల్డ్ రేట్లు!
మొదటి బహుమతిగా 10 కిలోల మేకను ప్రకటించారు. రెండో బహుమతిగా రెండు బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్స్, మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లు వెల్మకన్నె యువకులు తెలిపారు. ఇందుకు సంబందించిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో లక్కీ డ్రా పేరుతో పలు స్కీమ్‌లు పెట్టారు. అందులో ద్విచక్ర వాహనాలు, ప్రెజర్ కుక్కర్, ఇంట్లో వంట సామాగ్రిలను బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు చుక్క, ముక్క అంటూ బహుమతులు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!