Site icon NTV Telugu

Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!

Hyderabad

Hyderabad

Hyderabad Veera Hanuman Vijaya Yatra: ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది కూడా కర్మన్‌ ఘాట్ నుండి ప్రారంభమై గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంటుంది. అక్కడి నుండి సికింద్రాబాద్‌ లోని తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర సాగనుంది.

Hyderabad: హైదరాబాద్‌లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!

ఈ భారీ యాత్రను పురస్కరించుకుని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వీహెచ్‌పీ & భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. యాత్ర సాగే మార్గంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం అధికారులు గౌలిగూడ రామ్ మందిరం నుండి అఫ్జల్‌ గంజ్ మీదుగా తాడ్‌ బండ్ వరకు రూట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.

Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..

ఈ సందర్భంగా భజరంగ్‌దళ్, పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులకు కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు. గతంలో అబిడ్స్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి యాత్రకు ఆటంకం కలిగించారని, ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అలాగే యాత్ర ముగిసే వరకు ఏర్పాటు చేసిన కాషాయ జెండాలను, అలంకరణలను తొలగించవద్దని విన్నవించారు. గణేష్ ఉత్సవాల తరహాలోనే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా పండుగ వాతావరణంలో జరుపుకునేలా సహకరించాలని అధికారులను కోరారు.

Exit mobile version