Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Veera Hanuman Vijaya Yatra: ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది కూడా కర్మన్ ఘాట్ నుండి ప్రారంభమై గౌలిగూడ రామ్ మందిరం చేరుకుంటుంది. అక్కడి నుండి సికింద్రాబాద్ లోని తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర సాగనుంది.
Hyderabad: హైదరాబాద్‌లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!
Also Read
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
ఈ భారీ యాత్రను పురస్కరించుకుని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వీహెచ్‌పీ & భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు. యాత్ర సాగే మార్గంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం అధికారులు గౌలిగూడ రామ్ మందిరం నుండి అఫ్జల్ గంజ్ మీదుగా తాడ్ బండ్ వరకు రూట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..
ఈ సందర్భంగా భజరంగ్‌దళ్, పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులకు కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు. గతంలో అబిడ్స్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి యాత్రకు ఆటంకం కలిగించారని, ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అలాగే యాత్ర ముగిసే వరకు ఏర్పాటు చేసిన కాషాయ జెండాలను, అలంకరణలను తొలగించవద్దని విన్నవించారు. గణేష్ ఉత్సవాల తరహాలోనే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా పండుగ వాతావరణంలో జరుపుకునేలా సహకరించాలని అధికారులను కోరారు.
తాజావార్తలు
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్‌గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!