మనం ఎంత డబ్బులు సంపాదించిన ఖర్చులు ఎక్కువ కావడంతో డబ్బులు అయిపోతాయి.. ఇందుకు కారణం వాస్తు.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెట్టకుంటే తీవ్ర నష్టాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు.. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలా అమర్చుకోవాలి. ఎలాంటి వస్తువు ఏదిశలో ఉండాలి వంటి విషయాలన్నింటి గురించి కూడా వివరిస్తుంది.. మనం డబ్బులను దాచుకొనే పెట్టేలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే హారతి కర్పూరంలా కరిగిపోతుంది..కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. కొన్ని నెగెటివ్ వస్తువులు అల్మెరాలో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు.. ఆ వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం..
సాదారణంగా ముఖ్యమైన పత్రాలను, డబ్బులను బీరువాలో పెడుతుంటారు.. అయితే కేవలం ఇవి మాత్రమే లాకర్లలో పెట్టుకుంటే సమస్య ఉండదు. కానీ రకరకాల ఇతర వస్తువులను పెట్టినపుడు రకరకాల ప్రతికూల శక్తులు చేరే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా డబ్బు వచ్చే దారి మూసుకుంటుంది.. ఆ వస్తువులు ఏంటో, ఎందుకు డబ్బుల పెట్టేలో ఆ వస్తవులను పెట్టకూడదో ఒకసారి చూద్దాం..
కొంత మంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. కానీ ఇలా అమర్చుకోవడం మంచిదికాదు. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది..
అలాగే కొంతమంది ఫెర్ఫ్యూమ్స్ లను కూడా లాకర్స్ పెట్టకూడదు..ఫెర్ఫ్యూమ్స్ అల్మెరాలో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి. అందుపవల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
కొంతమంది డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు. నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది.. అందుకే డబ్బులను ఎప్పుడు గుడ్డలో పెట్టకూడదు..
ఏదైనా చిరిగిన లేదా పనికి రాని కాగితాలను డబ్బుదాచుకునే బీరువాల్లో దాచకూడదు. వీటి వల్ల ప్రతి కూల శక్తి వేగంగా పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు. డబ్బుకు లోటు ఏర్పడుతుంది.. అందుకే డబ్బుల పెట్టేలో వీటిని అస్సలు పెట్టకండి.. లేదంటే తీవ్రమైన నష్టాలు చూస్తారు..