మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది..నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ కార్యక్రమాని కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. వరుణ్ తేజ్, లావణ్య దంపతులను ఆశీర్వదించారు.. తన అన్నా, వదిన నిహారిక, వరుణ్ తేజ్ జంటతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ వేడుకకు పవన్ హైలెట్గా నిలిచారు.. పవన్ కళ్యాణ్ బ్లాక్ షర్ట్, జీన్స్ లో నాగబాబు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్పెషల్ లుక్ లో చాలా సింపుల్ గా కనిపించారు.. అక్కడున్న వారంతా పవన్ కళ్యాణ్ ను చూస్తూ ఉండిపోయారంటే నమ్మలేరు.. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కుటుంబంతో గడిపిన సరదా క్షణాలు ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ అవుతున్నాయి.
ఇక వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరగనుంది.. ఈ పెళ్లిని కూడా నాగబాబు రాజస్థాన్ పాలస్ లో చేయనున్నారని సమాచారం.. ఇక నిహారిక భర్త తో కాకుండా సింగిల్ గా కనిపించడంతో విడాకులు అయ్యాయాని జనాలు ఫిక్స్ అవుతున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే నిహారిక నోరు విప్పేవరకు ఆగాల్సిందే.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు..