Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్‌కు ముందు జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా గాయపడ్డారు. తన తదుపరి బరి సినిమా కోసం సిద్ధమవుతుండగా ఈ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన అప్ కమింగ్ మూవీ బరి కోసం వరుణ్ గత కొన్ని రోజులుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించనున్న ఆయన, అందులో పట్టు సాధించేందుకు ప్రాక్టీస్ చేస్తుండగా అకస్మాత్తుగా మోకాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. ఈ మేరకు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో అపోహలకు తావివ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సోదరి, నటి నిహారిక కొణిదెల అధికారికంగా ధృవీకరించారు.
144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ విడుదల చేశారు. “మా అన్నయ్య వరుణ్ తేజ్ బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయమైంది. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించాము. వైద్యులు మోకాలికి సర్జరీ నిర్వహించారు, ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.” అని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక సర్జరీ సక్సెస్ కావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు, ఆయన త్వరగా కోలుకుని, మళ్ళీ పూర్తి శక్తితో వెండితెరపై కనిపిస్తారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నిహారిక ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Tollywood: ఆ హీరో సినిమాకి బ్రేకులు.. తెర వెనుక అసలేం జరుగుతోంది?
తాజావార్తలు
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!