Site icon NTV Telugu

Varra Ravinder Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

Varra Ravinder Reddy

Varra Ravinder Reddy

Varra Ravinder Reddy: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈకేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ , సుబ్బారెడ్డి లకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్దరాత్రి రెండు గంటల సమయంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు సంబంధించిన పేపర్లను పీపీ, వర్రా రవీందర్ రెడ్డి తరఫు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రా రవీంద్ర రెడ్డికి రిమాండ్ విధించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

వర్రా రవీందర్ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలిపారని ఆయన తరపు లాయర్ ఓబుల్ రెడ్డి వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాదు నుంచి కడపకు వస్తున్నారని.. ఈ క్రమంలో కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అరికాళ్ళపై కొట్టి , తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్లు మెజిస్ట్రేట్ తో చెప్పారన్నారు. విజయమ్మపై వైయస్ షర్మిల పై,సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్ చేశారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ వారు టార్చర్ చేసినట్లు చెప్పాడని లాయర్ తెలిపారు. ఒప్పుకోకపోతే నీ కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని హెచ్చరించినట్లు కూడా మెజిస్ట్రేట్ ముందు వర్రా రవీంద్ర తెలిపాడన్నారు. వర్రా రవీంద్ర చెప్పిన స్టేట్మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. ఈరోజు మెడికల్ టెస్ట్‌కు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారని పేర్కొన్నారు.

 

Exit mobile version