Singer Srilalitha: ఘనంగా ‘వరాహరూపం’ ఫేం శ్రీ లలిత నిశ్చితార్థం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Srilalitha Engagement with Gudipati Seetaram: గాయని శ్రీలలిత భమిడిపాటి త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. గుడిపాటి సీతారాంతో శ్రీలలిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన పోటోలను గాయని శ్రీలలిత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఉంగరాలు మార్చుకున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫాన్స్, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘కాంతార’ సినిమా ఎంత హిట్ అయిందో.. అందులోని ‘వరాహరూపం..’ పాట కూడా అంత పాపులర్ అయింది. ఈ పాటకు శ్రీలలిత భమిడిపాటి చేసిన కవర్ సాంగ్ అంతకుమించి ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్లో ఏకంగా లక్షల వ్యూస్ను దక్కించుకుంది. ఆరేళ్ల వయసు నుంచి పలు రియాలిటీ షోలలో మెప్పించిన శ్రీలలితకు సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో తాను పాడిన అన్ని సాంగ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో శ్రీలలితకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
Also Read: Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!
శ్రీలలిత భమిడిపాటి సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. శ్రీలలిత అమ్మమ్మ వాళ్లూ, ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఆమె అమ్మ, నాన్న గాయకులే. మూడున్నరేళ్ల వయసులో ఓ స్టేజీ మీద రైమ్ చెప్పమని అడిగితే ‘లింగాష్టకం’ పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా పదిహేనుకు పైగా రియాలిటీ షోలలో శ్రీలలిత పాల్గొన్నారు. ఆమె ఎంఏ మ్యూజిక్ పూర్తి చేశారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఓ ఇన్స్టిట్యూట్ కట్టి కర్ణాటక సంగీతం నేర్పించాలన్నదే శ్రీలలిత టార్గెట్.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!