NTV Telugu Site icon

Vangalapudi Anitha: పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకొండి.. పోలీసులకు హోం మంత్రి వార్నింగ్

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలంటూ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత.. ఈ రోజు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనితకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు డీజీపీ హరీష్ గుప్తా.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు దయ వల్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. సామాన్య టీచర్‌ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు.. నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.

Read Also: T20 World Cup 2024: ‘సూపర్ 8’ భారత్ షెడ్యూల్ ఇదే!

ఇక, గత ఐదేళ్లలో లా అండ్ ఆర్థర్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందని తెలిపారు హోంమంత్రి అనిత.. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని ప్రకటించిన ఆమె.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి.. ఖాకీ డ్రెస్ కు గౌరవంగా పని చేయాలని స్పష్టం చేశారు.. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాల వరకూ తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. అక్రమాలకు బలైన వారు కేసు రీ-ఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం అని ప్రకటించారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.