Site icon NTV Telugu

PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

Pm Modi

Pm Modi

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్‌ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం..

మంగళవారం నాడు అడిస్ అబాబా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని స్వయంగా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వాగతించారు. అంతేకాదు.. ఆయన స్వయంగా వాహనం నడుపుతూ మోదీని హోటల్‌కు తీసుకెళ్లడం అరుదైన ఘటనగా నిలిచింది. మంగళవారం సాయంత్రం ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా మారింది. భోజన కార్యక్రమానికి తోడు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఇథియోపియా కళాకారులు “వందేమాతరం”ను మనసుకు హత్తుకునేలా ఆలపించారు. ఈ ప్రదర్శనను ఆస్వాదించిన ప్రధాని మోదీ కళాకారులను చప్పట్లతో అభినందించారు. ఆ సందర్భంలో అచ్చం ఓ పిల్లడు ఎలా ఆనందాన్ని ఆస్వాదిస్తాడో అలా ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. “నిన్న ప్రధాని అబియ్ అహ్మద్ అలీ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం అద్భుతంగా పాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ అనుభూతి మరింత భావోద్వేగంగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రదర్శన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్, ఆఫ్రికా సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆఫ్రికా దేశాలతో దౌత్య, అభివృద్ధి సంబంధాలు మరింత వేగం పుంజుకున్నాయి.

Exit mobile version