India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan: భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు మన జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ చిరస్మరణీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇకపై స్వదేశంలో జరిగే ప్రతీ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కి ముందు వందేమాతరం గేయాన్ని ప్లే చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. అయితే, సాధారణంగా పాడే కొన్ని పంక్తులు కాకుండా, ఏకంగా మొత్తం ఆరు చరణాలను స్టేడియంలో వినిపించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
వందేమాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 6న కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం వందేమాతరం అధికారిక ఆలపన సమయం 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించారు. ఈ గేయం ప్లే అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా నిలబడాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, రేడియో, టీవీలలో రాష్ట్రపతి ప్రసంగాలు ప్రసారమయ్యే ముందు, తరువాత, జాతీయ జెండా పరేడ్ సమయాల్లో మొత్తం ఆరు చరణాల పూర్తి గేయాన్ని ఆలపించడానికి అనుమతించింది.
Also Read
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ దీనిపై మండిపడుతూ, “అసలు ఏ కారణం లేకుండా ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? దీనివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందా? భారత క్రికెట్ జట్టు మరింత బలంగా తయారవుతుందా? లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏమైనా పురోగతి సాధిస్తామా? ప్రస్తుతం మన ఎగుమతులు పడిపోయాయి, దేశంపై అప్పుల భారం పెరిగిపోతోంది. నేటి యువత (Gen Z) ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు దీనితో తీరవు కదా! కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో ఒక రకమైన భావజాలాన్ని నిర్మించడానికే ఇదంతా చేస్తున్నారు” అని విమర్శించారు.
తాజావార్తలు
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!