EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFOకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా.. ఏ టెక్నాలజీ అయినా కీలకమే.. ఎందుకంటి.. అది ఎంతోమందిపై ప్రభావం చూపిస్తుంది.. ఇక, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యుల కోసం కొత్త వాట్సాప్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఇకపై వాట్సాప్ ద్వారానే తమ PF ఖాతాకు సంబంధించిన పలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంపై EPFO సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా అధికారికంగా సమాచారం వెల్లడించింది.
EPFO అధికారిక వాట్సాప్ ఛానెల్
దీనికోసం.. EPFO తన అధికారిక వాట్సాప్ ఛానెల్లో చేరాలని సభ్యులను కోరింది. అంతేకాదు.. సంస్థ తన పోస్ట్‌లో QR కోడ్‌ను కూడా అందుబాటులో ఉంచింది. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా EPFO అధికారిక వాట్సాప్ ఛానెల్ ద్వారా సభ్యులు ఈ సేవలను పొందవచ్చు. వాట్సాప్‌లో EPFO సేవలను ఉపయోగించుకోవాలంటే ముందుగా అధికారిక ఛానెల్‌కు కనెక్ట్ కావాలి. అనంతరం ‘Hello’ అని టైప్ చేసి పంపాలి. సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సందేశాన్ని పంపేలా చూసుకోవాలి.
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ముందుగా మొబైల్ నంబర్ వెరిఫికేషన్
సభ్యుడు పంపిన సందేశం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచే వచ్చిందా అనే విషయాన్ని EPFO ముందుగా ధృవీకరిస్తుంది. ఆ ధృవీకరణ పూర్తైన తర్వాత సభ్యుడికి స్థానిక భాషలో సులభమైన మెనూ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో అవసరమైన సేవను ఎంచుకుని సంబంధిత వివరాలను సమర్పించవచ్చు. సాధారణ ప్రశ్నలకు సమాధానాలను కూడా అక్కడే పొందవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు AI చాట్‌బాట్‌ను ఉపయోగిస్తారు. అవసరమైనప్పుడు EPFO డేటాబేస్‌లోని సమాచారాన్ని పరిశీలించి సమాధానం అందించే విధానం కూడా ఉంటుంది.
PF బ్యాలెన్స్ నుంచి క్లెయిమ్ స్టేటస్ వరకు
ఇక, ఈ వాట్సాప్ సేవ ద్వారా సభ్యులు తమ PF ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీల సమాచారాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా EPFO పరిధిలోని క్లెయిమ్ స్టేటస్‌ను కూడా వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీంతో ప్రతిసారి ప్రత్యేక పోర్టల్ లేదా ఇతర మార్గాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా పొందే వీలు ఉంటుంది..
తాజా అప్డేట్లు కూడా వాట్సాప్‌లోనే
ఈ కొత్త వాట్సాప్ ఛానెల్ ద్వారా EPFO సభ్యులు సంస్థకు సంబంధించిన తాజా అప్డేట్లు, ముఖ్యమైన సమాచారం, సేవలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సభ్యులకు సేవలను మరింత సులభంగా, వేగంగా అందించడంలో భాగంగానే EPFO ఈ వాట్సాప్ సదుపాయాన్ని ప్రారంభించింది.. ఇక, సభ్యులు కూడా సులువుగా ఆపరేషన్ చేయవచ్చు..
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!