Vallabhaneni Balashowry: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. జనసేన పార్టీలో చేరారు.. అంతేకాదు.. మరోసారి మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, ఇప్పుడు పార్టీ మాత్రమే మారింది.. జనసేన అభ్యర్థిగా మరోసార తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు బాలశౌరి.. ఇక, ఈ రోజు మచిలీపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అసలు తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు.. నేను వైసీపీ నుంచి జనసేనకు వచ్చాను.. చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను తిట్టాలని వైసీపీ నాపై ఒత్తిడి తెచ్చింది. నా వల్ల కాదు అని స్పష్టం చేశా.. బందరులో బాగా యాక్షన్ చేసే నేత ఉన్నారు.. అతనికి చెప్పుకోండని చెప్పాను అన్నారు.. ఇక, ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాను అని గుర్తుచేసుకున్నారు.
Read Also: GT vs DC : 17.3 ఓవర్లకే గుజరాత్ ఆలౌట్.. ఢిల్లీ లక్ష్యం 90..
ఇక, బందరులో ఓ నేత రెండు చెప్పులు చూపుతూ మాట్లాడతారు.. పవన్ కల్యాణ్ చెప్పులు బందరులో దొరికాయి అంటూ మాజీ మంత్రిపై సెటైర్లు వేశారు బాలశౌరి.. పోర్టు వద్ద ఫొటోలు దిగి తానే పోర్టు కట్టిస్తున్నానని పేర్నినాని చెబుతున్నాడు. పోర్టు తాను తెచ్చానని.. సముద్రం మా తాత తెచ్చాడని పేర్ని నాని చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. మరోవైపు బీసీ నేత కొల్లు రవీంద్రపై మర్డర్ కేసు పెట్టాడు. నా బీసీ, నా బీసీ అని చెప్పే జగన్.. రేపల్లెలో పెట్రోల్ పోసి తగులపెట్టిన అమర్నాధ్ గౌడ్ హంతకులను ఏం చేశారు.? అని ప్రశ్నించారు. అయితే, తాము అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైలు మార్గం వచ్చేలా చేస్తాం.. కేంద్రాన్ని ఒప్పిస్తాం అన్నారు. మరోసారి పవన్ కల్యాణ్ పేరును పేర్నినాని ఎత్తకుండా ఉండేలా కూటమి అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.