Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ibomma Ravi: ఐబొమ్మ రవి.. ఓ వైపు సినిమా పరిశ్రమని, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్లుగా అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసుల కస్టడీ రిపోర్ట్‌తో మరోసారి స్పష్టమైంది. 12 రోజులపాటు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి సేకరించిన కీలక వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో పైరసీ, ఆన్‌లైన్ బెట్టింగ్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన అనేక షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలను, మహిళలను కించపరిచారంటూ..!
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. క్యామ్ కాడర్ ప్రింట్‌కు ఒక్కో సినిమాకు 100 డాలర్లు, HD ప్రింట్‌కు ఒక్కో సినిమాకు 200 డాలర్లు చెల్లించినట్లు తెలిపాడు. కోవిడ్ తర్వాత తన పైరసీ బిజినెస్ మరింత మెరుగుపడిందని రవి విచారణలో తెలిపాడు. ఆన్‌లైన్‌లో సినిమాలు చూసే వారి సంఖ్య కోవిడ్ తర్వాత గణనీయంగా పెరగడంతో తన ఆదాయం భారీగా పెరిగిందని వివరించాడు.
రవి నిర్వహించిన 7 బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.13.40 కోట్లు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకే సారి ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా రూ.1.78 కోట్లు వచ్చినట్లు తేలింది. అలాగే ట్యాక్స్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో తన సోదరి చంద్రికకు రూ.90 లక్షలు బదిలీ చేసినట్లు రవి అంగీకరించాడు. అంతేకాకుండా, లావాదేవీలన్నీ ఎక్కువగా విదేశీ కరెన్సీ రూపంలోనే నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
ఇక కొంతకాలం పాటు కూకట్ పల్లి దగ్గరలో ఉన్న ఉషా ముళ్లపూడి ఆసుపత్రి ప్రాంతం సమీపంలో ఒక ఆఫీస్ నడిపినట్లు రవి తెలిపాడు. పైరసీ కార్యకలాపాల కోసం సుమారు 10 మందిని నియమించుకున్నట్లు కూడా వెల్లడించాడు. రాకేష్ అనే విదేశీయుడి ద్వారా ట్రేడ్‌మార్క్ లైసెన్స్ పొందినట్లు.. బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన ‘బిందాస్’ జీవితం గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా 12 రోజుల కస్టడీ ముగిసిన అనంతరం ఐబొమ్మ రవిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని కోణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!