Vaibhav Suryavanshi: ఐపీఎల్ సంచలనం, టీమిండియా అండర్-19 యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో జెర్సీ నంబర్ 18 ధరించడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. ఎందుకంటే.. ఈ నంబర్ దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందింది కాబట్టి. కోహ్లీ రిటైర్ అయ్యే వరకు మరెవ్వరూ ఈ నంబర్ ధరించరాదని కోహ్లీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Vaibhav Suryavanshi: ఆటలోనే కాదు సంపాదనలో కూడా అదరగొడుతున్నడు.. రోజుకు మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ మొత్తం జెర్సీ నంబర్ 18 ను ధరిస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పారు. ఈ నంబర్ కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు. ఆయన టెస్ట్ క్రికెట్, టీ20కు రిటైర్ అయినప్పటికీ, వన్డేలలో క్రియాశీలంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అండర్-19 క్రికెటర్ వైభవ్ అదే నంబర్ జెర్సీ ధరించడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ విషయమై.. బీసీసీఐ అధికారికంగా స్పందిస్తూ.. అండర్-19, ఇండియా ‘A’ జట్లకు, లేదా డొమెస్టిక్ లెవల్ క్రికెట్‌కి జెర్సీ నంబర్లు కేవలం ఆటగాళ్ల అభిరుచిపైనే ఆధారపడి ఉంటాయని.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే జెర్సీ నంబర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వివరించింది. అయినా కానీ ఇది కోహ్లీ అభిమానులకు సంతోష పరచలేదు. వారు సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 ను బీసీసీఐ రిటైర్ చేసిన ఉదాహరణను గుర్తు చేస్తున్నారు.
Rajinikanth : భాషా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్.. కానీ !
ఇక 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభ చూపిస్తూ డొమస్టిక్ లెవెల్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డేల్లో ఆకట్టుకున్న అతను యూత్ టెస్ట్‌లో తన సత్తా చాటాడు. అలాగే బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీసి, వికెట్ సాధించిన అతిపిన్న భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. వైభవ్ టాలెంట్‌పై ఎవరికీ సందేహం లేదు. కానీ, కోహ్లీ వారసత్వంతో నాటకీయంగా ముడిపడిన 18 నంబర్ జెర్సీ ధరించడం అవసరమయ్యిందా అనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు చెలరేగుతున్నాయి.
A new nunber 18 in whtes – Suryavanshi to bowl in beckenham pic.twitter.com/EvYEz9E4Wf
— Rohit Juglan (@rohitjuglan) July 15, 2025