Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: గ్రౌండ్ లో అడుగుపెడితే ఎంత అనుభవజ్ఞుడైన బౌలరైనా సరే నాకేంటి.. కొడితే బాల్ బౌన్దర్య దాటిందా లేదా అనే వైభవ్ సూర్యవంశీ, బయట మాత్రం ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత ఐపీఎల్ లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ ఈసారి తన బ్యాటింగ్ విన్యాసాలతో కాకుండా మరో అంశంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందుకు సంబంధించి ఓ సరదా ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విమానాశ్రయంలో ఇద్దరు చిన్నారులు అతనితో సెల్ఫీ తీసుకోవాలని అడిగిన సందర్భంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. విమానాశ్రయంలో కూర్చున్న సూర్యవంశీని చూసిన ఇద్దరు పిల్లలు సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చారు. అయితే అందుకు సరదాగా స్పందించిన సూర్యవంశీ, “ఫోటో తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు తీసుకుంటా.. ఒక ఫొటోకు రూ. 100 ఇవ్వాలి” అని అన్నాడు. దీనితో మొదట పిల్లలు కొద్దిగా ఆశ్చర్యపోయినా అతను నిజంగానే డబ్బులు అడుగుతున్నాడని భావించి ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ఇక్కడ ఇంకా ఫన్ ఏంటంటే.. మేము ఇద్దరమూ ఉన్నాము రూ. 200 తీసుకొని ఇద్దరికీ ఫోటోలు ఇవ్వమని పిల్లలు అమాయకంగా అన్నారు. దీనితో వెంటనే తన ప్రాంక్‌ను బయటపెట్టిన సూర్యవంశీ, అది సరదా కోసం మాత్రమేనని చెప్పి పిల్లలతో నవ్వుతూ ఫోటోలు దిగాడు. చివరగా “కెమెరా వైపు చూడండి” అని చెప్పి క్యూట్‌గా పోజ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇక క్రికెట్ విషయానికి వస్తే, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల డైనమేట్ తాజాగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం అతను 8 ఇన్నింగ్స్‌లో 357 పరుగులు చేసి, 234.87 స్ట్రైక్ రేట్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ సిద్ధమయ్యాడనే చెప్పవచ్చు.
Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!