Site icon NTV Telugu

Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి కొత్త ఆటగాళ్లు రాణించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పై పడింది.

వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి దగ్గరయ్యాడు. కేవలం 12 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌ లోనే సూర్యవంశీ 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 228.28 చూస్తే వైభవ్ బౌలర్లపై ఎలా విరుచకపడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దూకుడుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

ఇదే నిజమైతే.. కేవలం 15 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ టీమ్ ఇండియాలోకి వస్తే, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, భారత జట్టుకు ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ ను దక్కించుకుంటాడు. టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఎంపికలో ప్రధాన సమస్య టాప్ ఆర్డర్‌ లో చోటు కల్పించడం. ప్రస్తుతం టీమిండియాకు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ డ్యాషింగ్ ఓపెనర్లు ఉండనే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 విజయానంతరం వీరు జట్టుకు మరింత కీలకంగా మారారు.

Nari Shakti Vandan Bill: సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక భేటీ.. చంద్రబాబు లేఖలు, ఎన్డీఏ కూటమి చర్చలు.!

అయితే సాధారణంగా ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త ఆటగాళ్లను పరీక్షించే అవకాశం బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లకు రెస్ట్ ఇస్తే సూర్యవంశీ ఓపెనర్‌ గా ఆడే అవకాశం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కెరియర్ లో భారీ మార్పులు రానున్నాయి. చుడాలిమరి సెలెక్టర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో..

Exit mobile version