Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌కు ప్రకటించిన భారత జట్టు తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అవకాశం రాకపోవడంతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో అయినా 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభిస్తుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కూడా అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోయినా.. భారత జట్టు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. ఐర్లాండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేలను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టింది. వారి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకొచ్చింది.
Also Read
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
- 144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
గాయంతో ఐర్లాండ్ సిరీస్‌కు దూరమైన వరుణ్ చక్రవర్తి మళ్లీ జట్టులోకి వచ్చారు. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయని టీమ్ మేనేజ్మెంట్, బౌలింగ్ విభాగంలో స్పిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఇద్దరు ప్రధాన పేసర్లు మాత్రమే ఉన్నారు. ఇకపోతే టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు.
భారత్ ప్లేయింగ్ XI:
శ్రేయస్ అయ్యర్ (C), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (W), తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (W), జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహ్మూద్.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!