Vaibhav Sooryavanshi: నెట్స్‌లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్‌ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డకూ పాకింది. బుధవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అందరి కళ్లూ ఈ కుర్రాడిపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం (డెబ్యూ) చేస్తాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో సొంత జట్టు బౌలర్లతో ఆడుకుంటున్నాడు వైభవ్. నెట్స్ ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న ఈ బుడ్డోడిని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది.
మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో వైభవ్.. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ పేసర్ల బౌలింగ్‌ను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ కనిపించాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత్, బుధవారం ఇంగ్లాండ్‌తో తలపడబోయే ఈ సిరీస్ ఓపెనర్‌లో వైభవ్ ఆడతాడా అనేది సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌ను అడ్డుకోవడానికి అప్పుడే వ్యూహాలు సిద్ధం చేసుకుంది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్న స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “వైభవ్‌ను ఎదుర్కొనేందుకు మా దగ్గర పక్కా ప్లాన్స్ ఉన్నాయి. అవి మైదానంలో వర్కవుట్ అవుతాయని ఆశిస్తున్నాం” అని మ్యాచ్‌కు ముందు బ్రూక్ తెలిపాడు. భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ క్రికెట్ ఆడకుండా అడ్డుకునేందుకు, తెరవెనుక చాలా హోమ్‌వర్క్ (రీసెర్చ్) చేశామని బ్రూక్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ అంతలా భయపడటానికి బలమైన కారణమే ఉంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీజన్ మొత్తంలో 776 పరుగులు రాబట్టి ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) తో పాటు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. ఒకవేళ బుధవారం జరిగే మ్యాచ్‌లో వైభవ్ గనుక బరిలోకి దిగితే, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన (యంగెస్ట్ డెబ్యూటెంట్) అంతర్జాతీయ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును ఈ 15 ఏళ్ల బీహార్ సంచలనం బ్రేక్ చేయనుంది. ఈ చారిత్రాత్మక క్షణం కోసం క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది.
Also Read
Vaibhav Suryavanshi is taking out his frustration from the Ireland T20 series loss in the nets at Durham.😭🔥 pic.twitter.com/80T3ovtnRY
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026
Vaibhav Suryavanshi smashing big shots in the nets during the practice session in Durham ahead of the match against England.🔥
Will Vaibhav Suryavanshi get a chance against England? If he does, who should be dropped from the playing XI? pic.twitter.com/Y4nNrOj4VX
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నెట్స్‌లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్‌ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
-
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
-
Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!