Vaibhav Sooryavanshi: వైభవ్‌కు బంపర్ ఆఫర్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. సచిన్ రికార్డుకు ఎసరు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం భారత క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. త్వరలోనే తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. 15 ఏళ్ల ఈ కుర్రాడిని సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైభవ్‌ను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించే ఉద్దేశంతో ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే పర్యటనకు కూడా వైభవ్ ఎంపికయ్యే అవకాశం ఉందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) అత్యంత పిన్న వయస్కుడైన డెబ్యూటెంట్ కాగా, మహిళల క్రికెట్‌లో షఫాలీ వర్మ (15 ఏళ్ల 7 నెలల 27 రోజులు) ఆ రికార్డును కలిగి ఉన్నారు. ఒకవేళ వైభవ్ ఐర్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే, వీరిద్దరి రికార్డులను అధిగమించి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
READ MORE: Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
Also Read
ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌లు మాజీ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఆర్‌సీబీపై 26 బంతుల్లో 78 పరుగులు, సీఎస్‌కేపై 17 బంతుల్లో 52, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 39 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ అసాధారణ ప్రదర్శనపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు చాలా అరుదుగా దొరుకుతాడని, భారత్ తరపున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాలని ధుమాల్ ఆకాంక్షించారు. ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి మాజీ ఆటగాళ్లు కూడా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడని మద్దతు తెలుపుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..