Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అభిమానులను నిరాశపరిచాడు. ఇటీవలి కాలంలో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న వైభవ్ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ కేవలం 14 పరుగులకే అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో వైభవ్ సూర్యవంశీ కొన్ని ఆకర్షణీయమైన షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసినప్పటికీ.. లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంక ‘ఎ’ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీకి వైభవ్ పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ నాలుగో బంతికి క్రీజులోనే ఉండి స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి సరిగ్గా కనెక్ట్ కాక మిడ్-ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. వైభవ్ అవుట్ కాగానే లంక ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్‌ సూర్యవంశీ (15 ఏళ్ల 71 రోజుల) రికార్డు సృష్టించాడు. సుదీర్ఘకాలంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును ఈ బాలుడు బద్దలు కొట్టాడు. సచిన్‌ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ.. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన సచిన్ రికార్డు బద్దలు గొట్టిన వైభవ్.. ఓ మార్కును మాత్రం దాటలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ పాకిస్థాన్‌తో ప్రారంభమైంది. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బరిలోకి దిగాడు. కరాచీ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సచిన్ క్రీజులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులు (24 బంతుల్లో, 2 ఫోర్లు) చేశాడు. విశేషం ఏంటంటే.. తొలి మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులు చేయగా.. వైభవ్ మాత్రం 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగుతో సచిన్ ముందంజలో ఉన్నాడు. కానీ.. ఇక్కడ మరో విషయం గమనించాలి. సచిన్ టెస్ట్‌ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వగా.. వైభవ్ మాత్రం వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేశాడు.

×
×
Ad