Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రికెట్ ప్రపంచంలో తన వయసుకి తన ఆడే ఆట తీరుకి అసలు సంబంధమే ఉండదు. అతడు బ్యాటింగ్ ఆడే సమయంలో ఎదుట ఎంత తోపు బౌలర్ అయినా సరే.. అయితే నాకేంటి అన్నట్లుగా బంతిని బౌండరీని దాటించడమే లక్ష్యంగా బడుతాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో తన మెరుపు బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన మార్క్ స్టైల్ ఇన్నింగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. కేవలం 15 బంతుల్లో అర్ద సెంచరీని నమోదు చేసాడు ఈ చిచ్చర పిడుగు. ఈ దెబ్బతో రాజస్థాన్ రాయల్స్ భారీ విజయాన్ని అందుకుంది.
Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!
అయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో కాకుండా సంస్కారంతో అందరి మనసు గెలుచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న కీలక పోరుకు ముందు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఎదురవగానే వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం తడబడకుండా ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ దృశ్యం చూసిన నెహ్రా వెంటనే ఆ కుర్రాడిని పైకి లేపి ఆలింగనం చేసుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారు. మైదానంలో ప్రత్యర్థులైనా, బయట పెద్దల పట్ల వైభవ్ చూపిన పద్దతిని చూసి క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Mega 158: మెగాస్టార్ – బాబీ కొల్లి క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్.. జోడీ ఎవరంటే?
Pranaam, Nehra Ji! 🙏🤗 pic.twitter.com/ZnJuPZro7L
— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026
ఇక ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుండి వైభవ్ వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి జట్లపై యూత్ వన్డే సిరీస్ లలో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 ఐపీఎల్ మ్యాచ్ల్లో 304 పరుగులు చేసిన వైభవ్, 200+ స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. చూడాలి మరి నేడు జరగనున్న మ్యాచ్‌లో ఇంకా ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తాడో..
Tukur tukur 👀😂 pic.twitter.com/ohzQtUs5Q2
— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026
