Mega 158: మెగాస్టార్ – బాబీ కొల్లి క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్.. జోడీ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega 158: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు, ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 అధికారిక పూజా కార్యక్రమం ఏప్రిల్ 11న ఘనంగా జరగనుంది. ఈ చిత్రం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండబోతోందని, చిరంజీవి పాత్ర గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని ఇండస్ట్రీ టాక్, ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, చిరంజీవికి భార్య పాత్రలో వర్సటైల్ యాక్ట్రెస్ ప్రియమణి నటించబోతున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత అయిన ప్రియమణి, తన నటనతో ఈ చిత్రానికి కొత్త బలాన్ని ఇస్తారని మేకర్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ సరసన ఆమె నటించడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ కొత్త కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందోనని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.
READ ALSO: UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
కన్నడ చిత్ర పరిశ్రమలో ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్, ఈ ప్రాజెక్ట్‌తో నేరుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువల మధ్య ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుంది. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెగాస్టార్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ 11న జరిగే పూజా కార్యక్రమంతో ఈ సినిమా టైటిల్ లేదా మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
READ ALSO: Rajasekhar: నా గోళీల ఫ్యాక్టరీ మాత్రం వదిలిపెట్టను
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?