Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vaazha 2 Creates History Emerges As All Time No 1 Industry Hit At Kerala Box Office

Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు!

Published Date :April 27, 2026 , 12:13 pm
By subbarao kilari
Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ చిత్ర పరిశ్రమ మోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది.  స్టార్ పవర్ లేకుండా కేవలం కంటెంట్ మరియు యూత్ ఆడియన్స్ మద్దతుతో వచ్చిన ‘వాల 2′ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి సరికొత్త ‘ఇండస్ట్రీ హిట్’గా అవతరించింది.  బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘లోక‘  మరియు మోహన్ లాల్ ‘తుడరుమ్‘ చిత్రాల రికార్డులను అధిగమించి ఈ సినిమా ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘వాల 2’ కేరళలో కేవలం 25 రోజుల్లోనే రూ. 122 – 123 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో కేరళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సాధించిన మరో అరుదైన  రికార్డ్ చూస్తే.. 2000 సంవత్సరం తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద 80 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైన మూడవ చిత్రంగా ‘వాల 2’ నిలిచింది. గతంలో మోహన్ లాల్ నటించిన ‘నరసింహం’ మరియు ‘పులిమురుగన్’ చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పుడు ఆ దిగ్గజాల సరసన ఈ చిన్న సినిమా చేరడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్ హాషిర్ మరియు టీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విపిన్ దాస్ కథను అందించగా సవిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

Also Read

  • Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hashir Vaazha 2 news
  • highest grossing Malayalam movies
  • Kerala box office records 2026
  • Mollywood industry hit 2026
  • Vaazha 2 Box Office Collection

తాజావార్తలు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions